Friday 29 March, 2013

Ugaadi Kavitha


నందనందనా నీ నామ సంవత్సరం

నీకులాగ ఉద్దరిస్తుందనుకున్నం

ఉద్దరణ జరగకపోగా మిగిలింది ఉత్కంపం

హిందూ జాతికి జరిగింది తీరని నష్టం వీడని కష్టం

ద్వాపరంలో చేశావు గోపికా మాన సంరక్షణం

నీ వత్సరంలో మిగిలించావు స్త్రీలకు మానభంగం

నమ్మినందుకు ఇదా నీవిచ్చే బహుమానం...

నాడు నీవున్నావు తోడుగా విజయునికి,

నీవేనుకనే వస్తున్నాడు విజయుడు పాలనకి

ఎదురు చూస్తున్నాము నారాయనునికన్న గొప్ప నరుడని

కలియుగములో విజయుడైనా మమ్ములను ఆదుకుంటాడని

పెద్దలు అన్నారు ధర్మో రక్షతి రక్షితః

ఎప్పుడా అని ఎదురు చూస్తోంది భక్తజనం

నీ వల్ల కాదులే అని ఎగురుతోంది పర మతం.

ప్రభాత సమయాన చేస్తున్నాం నీ సుప్రభాతం

తిమిర సమయాన నీకిస్తున్నాం ఏకాంతం

రెండింటి మధ్య మేము చేస్తున్నాం గోవిందం
విజయ నామ సంవత్సరంలోనైన మాకు ఇవ్వు ఆనందం