Friday, 29 March 2013

Ugaadi Kavitha


నందనందనా నీ నామ సంవత్సరం

నీకులాగ ఉద్దరిస్తుందనుకున్నం

ఉద్దరణ జరగకపోగా మిగిలింది ఉత్కంపం

హిందూ జాతికి జరిగింది తీరని నష్టం వీడని కష్టం

ద్వాపరంలో చేశావు గోపికా మాన సంరక్షణం

నీ వత్సరంలో మిగిలించావు స్త్రీలకు మానభంగం

నమ్మినందుకు ఇదా నీవిచ్చే బహుమానం...

నాడు నీవున్నావు తోడుగా విజయునికి,

నీవేనుకనే వస్తున్నాడు విజయుడు పాలనకి

ఎదురు చూస్తున్నాము నారాయనునికన్న గొప్ప నరుడని

కలియుగములో విజయుడైనా మమ్ములను ఆదుకుంటాడని

పెద్దలు అన్నారు ధర్మో రక్షతి రక్షితః

ఎప్పుడా అని ఎదురు చూస్తోంది భక్తజనం

నీ వల్ల కాదులే అని ఎగురుతోంది పర మతం.

ప్రభాత సమయాన చేస్తున్నాం నీ సుప్రభాతం

తిమిర సమయాన నీకిస్తున్నాం ఏకాంతం

రెండింటి మధ్య మేము చేస్తున్నాం గోవిందం
విజయ నామ సంవత్సరంలోనైన మాకు ఇవ్వు ఆనందం

Tuesday, 22 May 2012

నీవు లేని క్షణం యుగముగా మారె....


నీవు లేని నందనం యమలోకమై పోయే.....

నీవు లేని కౌముది నిశీధిగా మారె....

నీవు లేని నన్ను ఊహించడమే కష్టమాయే.....
నన్నేదో వెచ్చని గాలి తాకుతోంది....


అది నీ శ్వాసేనేమో అనిపిస్తోంది.....

కాదని ఎవరన్న నా మనసు నమ్మనంటోంది.....

నీకోసం నీవైపే పయనం సాగిస్తోంది....

Monday, 16 January 2012

స్నేహం...

సృష్టిలో అమూల్యమైనది.....


అమ్మలాంటి ప్రేమ పంచగలది.....

నాన్నలాంటి రక్షణ కల్పించగలది.....

ప్రేమకన్నా విభిన్నమైనది.....

Thursday, 12 January 2012

నీ పలుకులు విన్న క్షణం మనసులో ఏదో కలవరం....


నిన్ను చూడకుండా ఉండలేక నా మనసుతో నాకు నిత్యం ఓ కలహం....

తీరా నిన్ను చూశాక దానికి వేయలేకపోతున్నాను నే కళ్ళెం....

అది అంటోంది నీతోనే గడపాలని నా జీవితం....

Monday, 19 December 2011

చిరునవ్వు.....

తెలుపలేని భావాలను తెలుపగలదు.....


ఎంతటి కోపమైన మాయం చేయగలదు....

ఎదుటివారిని ఆకట్టుకొని కట్టి పడేయగలదు...

అందుకే వాడనీయకు నీ మోముపై సన్నని చిరునవ్వును.....

Wednesday, 2 November 2011

నిజం.......

ప్రతిక్షణం నీతో ఉంటె ఆనందం...


కాని ఉండనివ్వదు కాలం....

అనుక్షణం నీకై బ్రతకాలని జీవితం....

ఎంత ఎదురుచూసినా అవ్వదు అది నిజం......

Tuesday, 13 September 2011

కవిత

ప్రియా నిను చుడలేక అనుక్షణం....


కలవర పడెను నా హృదయం....

నీకేలా ఈ పంతం???

కరిగించవేల ఈ దూరం???