Tuesday, 13 September 2011

కవిత

ప్రియా నిను చుడలేక అనుక్షణం....


కలవర పడెను నా హృదయం....

నీకేలా ఈ పంతం???

కరిగించవేల ఈ దూరం???

Wednesday, 7 September 2011

నాన్నకి పుట్టినరోజు కానుక....

శ్రీమంతులే ఆస్తిలో కాదు మంచి మనసులో...


రాగ ద్వేషాలు లేవు అనురాగం ఆప్యాయత తప్ప...

నిషి గంభీరం మాట కాటిన్యం కానీ మనసు మంచులా కరి

గిపోతుంది ఎవరైనా ఆపదలో ఉంటే....అ

రిలేని మిమ్ములను చూసి ఆ

రికి కూడా ఈర్ష్య కలిగితే ఆశ్చర్యపడనక్కర్లేదు... మన్మధుని

నుసి చేసిన ఈశ్వరుడిలా కోపం ఉన్నప్పటికీ హిమవంతుని అంత ఎత్తు

మంచి మనసుతో సరస్వతినే మీ అర్ధాంగిని చేసుకుని

మరిరువురు కలిసి ఎందరు విద్యార్ధుల భవితకు పునాది వేయడమే కాకుండా

రాయంచ నడకలతో పాటు ఎన్నో విద్యలు మీ పుత్రికకు నేర్పి ఎందరినో

వున్నతులుగా తీర్చిదిద్దిన మీరు కలకాలం జీవించాలని ఆసిస్తూ ఆకాంక్షిస్తూ....

Tuesday, 6 September 2011

దయ చూపవేమి???

సూర్యుడు నీలాంబరాన దాక్కోను వేళ.... చీనామ్బరములు ధరించి....


పాంచజన్యము ధరింపక.... మురళిని ధరించి.....

ఈ మగువను చేపట్టగా....

ఏ వేలకు వచ్చెదవో అని ఎదురుచూచుచు కనులు కాయలు కాయగా....

నీకై నిరీక్షించుచు తపించుచున్న అబల యెడ దయ చూపవేమి స్వామి???

నిన్ను చేరలేక......

ఘడియలె యుగములాయే నిన్ను చూడకుంటే ....


క్షణమైనా గడవదాయే నీతో మాట్లాడకుంటే...

లక్షణముగా క్షణమైనా నీ పక్కన నే కూర్చుంటే....

ఓర్వలేక ఈ ప్రపంచమే వేరుచేసే మన ఇరువురిని....